- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Union Bank: వివాదంలో యూనియన్ బ్యాంక్
యూనియన్ బ్యాంకు సుబ్రమణియన్ రాసిన పుస్తకం కొనుగోలు వ్యవహారం వివాదంగా మారింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివాదంలో చిక్కుకుంది. మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కె వి సుబ్రమణియన్ రాసిన పుస్తకాన్ని 2,00,000 కాపీలను కొనుగోలు చేసేందుకు సుమారు రూ. 7.25 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎకనమిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. వారం రోజుల క్రితమే భారత ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుబ్రమణియన్‌ను అర్ధాంతరంగా తొలగించిన సంగతి తెలిసిందే. అందుకు ప్రభుత్వం కారణాలను కూడా వివరించలేదు. సుబ్రమణియన్ పదవీకాలం ముగిసేందుకు ఇంకా ఆరు నెలలు ఉండగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో యూనియన్ బ్యాంకు సుబ్రమణియన్ రాసిన పుస్తకం కొనుగోలు వ్యవహారం వివాదంగా మారింది. గతేడాది ఆగష్టులో కె వి సుబ్రమణియన్ 'ఇండియా@100' పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని కస్టమర్లు, స్థానిక పాఠశాలలు, కాలేజీలు, లైబ్రరీలకు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసింది. దీనికోసం 1,89,450 పేపర్‌బ్యాక్ కాపీలను రూ. 350 ధరతో, 10,422 హార్డ్‌కవర్ కాపీలను రూ. 597తో ఆర్డర్ చేసింది. దీనికోసం రూ. 7.25 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ఏ ఎంగ్లీష్ పుస్తకమైనా 10 వేల కాపీలు అమ్ముడుపోవడం అరుదు. కానీ, యూనియన్ బ్యాంకు ఏకంగా 2 లక్షల కాపీలను కొనడం, ఈ పుస్తకం విడుదలకు ముందే ప్రచురించిన రూపా పబ్లికేషన్స్‌కు 50 శాతం మొత్తం బ్యాంకు చెల్లించడం వివాదంగా మారింది. అంతేకాకుండా యూనియన్ బ్యాంకుకు చెందిన 18 జోనల్ ఆఫీసుల నుంచి 10,000 చొప్పున కాపీలు ఆర్డర్ చేయడం అనేక సందేహాలను రేకెత్తిస్తోంది.






