ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు సవరించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!

by Disha Web Desk 13 |
ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు సవరించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై వడ్డీ రేట్లను సవరించిన బ్యాంకు, ఈ నిర్ణయం మే 23 నుంచే అమల్లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, 7-45 రోజుల కాలపరిమితికి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై 3 శాతం వడ్డీ ఇస్తోంది. 46-90 రోజుల డిపాజిట్లపై 4.05 శాతం, 91-180 రోజులకు 4.30 శాతం, 181 రోజుల నుంచి ఏడాది కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 5.35 శాతం వడ్డీ లభిస్తుంది.

ఏడాది నుంచి 398 రోజుల ఎఫ్‌డీలపై 6.30 శాతం, 399 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై గరిష్ఠంగా 7 శాతం వడ్డీని బ్యాంకు ఆఫర్ చేస్తోంది. 400 రోజుల 3 ఏళ్ల కాలానికి 6.30 శాతం, 3 ఏళ్ల కాలానికి 6.50 శాతం, 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కాలానికి 6.70 శాతం వడ్డీ ఇవ్వనుంది. అన్ని కాలవ్యవధులపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు సాధారణ వినియోగదారుల కంటే 0.75 శాతం ఎక్కువ వడ్డీ రాబడి లభిస్తుంది.

Next Story

Most Viewed