- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Unemployment Rate: 4.7 శాతానికి తగ్గిన నిరుద్యోగ రేటు
ఇది ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత నమోదైన అత్యల్పమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: పనిచేసే అవకాశం ఉన్న 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తుల్లో నిరుద్యోగ రేటు మరింత దిగి వచ్చింది. గణాంకాలు, పథక అమలు మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన కార్మిక సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) గణాంకాల ప్రకారం, నవంబర్‌లో నిరుద్యోగ రేటు 4.7 శాతానికి తగ్గింది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత నమోదైన అత్యల్పమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతకుముందు అక్టోబర్‌లో నిరుద్యోగ రేటు 5.2 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. సమీక్షించిన నెలలో గ్రామీణ నిరుద్యోగం కొత్త కనిష్ట స్థాయి 3.9 శాతానికి చేరింది. ఇదే సమయంలో పట్టణ నిరుద్యోగం 6.5 శాతానికి తగ్గింది. ఇది ఏప్రిల్‌లో నమోదైన స్థాయిలోనే ఉంది. మరోవైపు, నవంబర్‌లో పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ నిరుద్యోగం క్షీణించింది. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న మహిళల్లో నిరుద్యోగ రేటు 5.4 శాతం నుంచి 4.8 శాతానికి తగ్గింది. పురుషుల్లోనూ ఇది 5.1 శాతం నుంచి 4.6 శాతానికి దిగొచ్చింది.






