Unemployment: 2024లో స్వల్పంగా 4.9 శాతానికి తగ్గిన నిరుద్యోగం రేటు

by S Gopi |

పట్టణ ప్రాంతాల్లో పురుషుల నిరుద్యోగం 6 శాతం నుంచి 6.1 శాతానికి పెరిగింది.

Unemployment: 2024లో స్వల్పంగా 4.9 శాతానికి తగ్గిన నిరుద్యోగం రేటు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో నిరుద్యోగిత రేటుపై పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) కీలక వివరాలను వెల్లడించింది. దేశంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులలో నిరుద్యోగం రేటు మునుపటి సంవత్సరంలో ఉన్న 5 శాతం నుంచి 2024 క్యాలెండర్ సంవత్సరంలో 4.9 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో, మొత్తం నిరుద్యోగంలో స్వల్పంగా 4.3 శాతం నుంచి 4.2 శాతానికి క్షీణించింది. ఈ మేరకు బుధవారం స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల నిరుద్యోగం 6 శాతం నుంచి 6.1 శాతానికి పెరిగింది. అయితే, స్త్రీలలో నిరుద్యోగం 8.9 శాతం నుంచి 8.2 శాతానికి పడిపోయింది. ఫలితంగా మొత్తం పట్టణ నిరుద్యోగైత రేటు 6.7 శాతం వద్ద స్థిరంగా ఉంది. దేశవ్యాప్తంగా కుటుంబాల్లో జీతాలు చెల్లించని సహాయకుల సంఖ్య తగ్గడం గ్రామీణ మహిళల్లో డబ్ల్యూపీఆర్ (కార్మికుల జనాభా నిష్పత్తి), ఎల్ఎఫ్‌పీఆర్ (శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు) తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. అన్ని వర్గాలలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మొత్తం డబ్ల్యూపీఆర్ 47 శాతం నుంచి 47.6 శాతంతో స్వల్పంగా మెరుగుపడింది. దేశవ్యాప్తంగా కూడా మొత్తం డబ్ల్యూపీఆర్ 53.4 శాతం నుంచి 53.5 శాతానికి స్వల్పంగా మాత్రమే తేడా ఉంది. పట్టణ ప్రాంతాల్లో పురుషులకు సంబంధించి ఎల్ఎఫ్‌పీఆర్ పెరిగింది. 2023లో 74.3 శాతం నుంచి 2024లో 75.6 శాతానికి పెరిగింది. స్త్రీల విషయంలో 25.5 శాతం నుంచి 25.8 శాతానికి కొద్దిగా పెరిగింది. పట్టణ ప్రాంతంలో సగటు ఎల్ఎఫ్‌పీఆర్ 50.3 శాతం నుంచి 51 శాతానికి పెరిగింది. మొత్తంగా దేశంలో నిరుద్యోగం 3.1 శాతం నుంచి 3.2 శాతానికి స్వల్పంగా పెరిగిందని పీఎల్ఎఫ్ఎస్ వెల్లడించింది.

Next Story