Unemployment: ఐదు నెలల గరిష్ఠానికి నిరుద్యోగం

by S Gopi |

ఇది గడిచిన నెలల్లోనే అత్యధికమని పీఎల్ఎఫ్ఎస్ పేర్కొంది.

Unemployment: ఐదు నెలల గరిష్ఠానికి నిరుద్యోగం
X

దిశ, బిజినెస్ బ్యూరో: పనిచేసే అవకాశం ఉన్న 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తుల్లో నిరుద్యోగ రేటు పెరిగింది. గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన కార్మిక సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) డేటా ప్రకారం, ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి దేశంలో నిరుద్యోగ రేటు 5.1 శాతానికి పెరిగింది. ఇది గడిచిన నెలల్లోనే అత్యధికమని పీఎల్ఎఫ్ఎస్ పేర్కొంది. అంతకుముందు నెలలో ఇది 4.9 శాతంగా నమోదైంది. సమీక్షించిన నెలలో పట్టణ నిరుద్యోగం 0.2 శాతం పెరిగి 6.8 శాతం పెరగ్గా, గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం కూడా స్వల్పంగా 4.3 శాతానికి చేరింది. పురుషుల్లో నిరుద్యోగం 5 శాతానికి చేరగా, మహిళల్లోనూ కొంత పెరిగి 5.3 శాతానికి పెరిగినట్టు పీఎల్ఎఫ్ఎస్ డేటా పేర్కొంది. మరోవైపు, 'కార్మిక శక్తి భాగస్వామ్య రేటు' (ఎల్ఎఫ్‌పీఆర్), అంటే పని కోసం వెతుకుతున్నవారి శాతం. గత నెలలో 55.4 శాతానికి తగ్గింది.

Next Story