Economy: భారత్ వృద్ధి అంచనాను తగ్గించిన ఐక్యరాజ్యసమితి

by S Gopi |

గతంలో దేశ జీడీపీ 6.6 శాతం పెరగవచ్చని చెప్పిన దానికంటే స్వల్పంగా తగ్గించింది.

Economy: భారత్ వృద్ధి అంచనాను తగ్గించిన ఐక్యరాజ్యసమితి
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ 2026లో 6.4 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో అంచనా వేసింది. గతంలో దేశ జీడీపీ 6.6 శాతం పెరగవచ్చని చెప్పిన దానికంటే స్వల్పంగా తగ్గించింది. దీనికి ప్రధానంగా గ్లోబల్ టెన్షన్స్, పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఏర్పడిన పరిణామాలని పేర్కొంది. చమురు ధరల పెరుగుదల, గ్లోబల్ మార్కెట్ల అస్థిరత, కఠిన ఆర్థిక పరిస్థితులు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని నివేదిక తెలిపింది. అయినప్పటికీ, ఈ సవాళ్ల మధ్య కూడా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. భారత్ ముఖ్యంగా భారీ చమురు దిగుమతులపై ఆధారపడటం, అంతర్జాతీయంగా ఇవి పెరగడం అధిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి సీనియర్ ఆర్థికవేత్త ఇంగొ పిటర్లె చెప్పారు. భారత్‌కున్న స్థానిక డిమాండ్, ప్రభుత్వ పెట్టుబడులు, సేవల ఎగుమతులు ఇప్పటికీ అతిపెద్ద ప్లస్ పాయింట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. 2027 నాటికి భారత్ మళ్లీ 6.6 శాతం వృద్ధి రేటును చేరుకునే అవకాశం ఉందని యూఎన్ పేర్కొంది.

Next Story