- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్కెట్‌లోకి మరో అదిరిపోయే బైక్..323 కిమీ మైలేజ్..ధర ఎంతంటే !
X-47 క్రాస్ ఓవర్ ( Ultraviolette X-47 Crossover ) అనే కొత్త అడ్వెంచర్ ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకువచ్చింది. ఈ బైక్ రోడ్లపై

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ మార్కెట్లో అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో... ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపిస్తున్నారు ప్రజలు. దీనికి తగ్గట్టుగానే రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా... అల్ట్రా వయోలెట్ అనే కంపెనీ... X-47 క్రాస్ ఓవర్ ( Ultraviolette X-47 Crossover ) అనే కొత్త అడ్వెంచర్ ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకువచ్చింది. ఈ బైక్ రోడ్లపైనే కాకుండా కష్టతరంగా ఉన్న దారుల్లో కూడా దూసుకు వెళుతుంది. మంచి ఫీచర్స్ తో ఈ రాడార్ బైక్ తీసుకువచ్చారు.
ఇందులో 77 GHz రాడార్ సిగ్నల్ ఇంకా కూడా ఉంటుంది. దీనివల్ల 200 మీటర్ల సరౌండింగ్స్ మొత్తం.. ఈ బైక్ మానిటర్ చేస్తుంది. వెనుక నుంచి ఏదైనా వాహనం వచ్చి.. ఢీకొట్టే ప్రమాదం ఉన్న, ఇతర వాహనాలు ఓవర్టేక్ చేసినా మనను ఈ బైక్ అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ బైక్ లో 10.3 kwh బ్యాటరీ కెపాసిటీ అందిస్తున్నారు. అంటే ఈ బైక్ ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 323 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 2.7 సెకండ్లలో 60 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది ఈ బైక్. అంటే గంటకు 145 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. ఇక ఈ బైక్ ధర రూ.2.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అక్టోబర్ లో డెలీవరీలు ప్రారంభం కానున్నాయి.






