- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Uber: ఉబర్-జేఎస్‌డబ్ల్యూ కీలక భాగస్వామ్యం
పట్టణాల్లో కాలుష్య రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ఈ ప్రయత్నం దోహదపడనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వినియోగాన్ని పెంచేందుకు ప్రముఖ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ ఉబర్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు జేఎస్‌డబ్ల్యూ గ్రూపునకు చెందిన పార్థ్ జిందాల్, ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, ఉబర్ క్యాబ్ సేవల కోసం ప్రత్యేకంగా తక్కువ ఖర్చుతో, అధిక సామర్థ్యంతో పనిచేసే కొత్త ఈవీ మోడళ్లను జేఎస్‌డబ్ల్యూ గ్రీన్ మొబిలిటీ సంస్థ తయారు చేయనుంది. పెరుగుతున్న రవాణా డిమాండ్‌కు అనుగుణంగా ఈ వాహనాలను రూపొందించడమే కాకుండా, నిర్వహణ ఖర్చులు తగ్గించి డ్రైవర్ల ఆదాయాన్ని పెంచడమే ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యం. పట్టణాల్లో కాలుష్య రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ఈ ప్రయత్నం దోహదపడనుంది. దేశీయ పరిస్థితులకు అనుగుణంగా, వినియోగదారుల అవసరాలకు సరిపోయేలా ఈవీల తయారీ ఉంటుందని కంపెనీలు వివరించాయి. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు సంస్థలు ఇంకా వెల్లడించలేదు.






