TVs: రూ. 85,000 వరకు తగ్గిన టీవీ ధరలు

by S Gopi |

వినియోగదారులకు పండుగ సీజన్ ఆఫర్లతో పాటు జీఎస్టీ తగ్గింపు ద్వారా తక్కువ ధరలో తమకు కావాల్సిన ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు

TVs: రూ. 85,000 వరకు తగ్గిన టీవీ ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పన్ను తగ్గింపు ప్రయోజనాలు అమలులోకి రానున్నాయి. ఈ క్రమంలో టీవీ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులపై తగ్గిన జీఎస్టీ ప్రయోజనాలను బదిలీ చేశాయి. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేయగా, అన్ని రకాల టీవీలపైనా రూ. 2,500 నుంచి రూ. 85,000 వరకు తగ్గింపు అమలు కానున్నాయి. దీనివల వినియోగదారులకు పండుగ సీజన్ ఆఫర్లతో పాటు జీఎస్టీ తగ్గింపు ద్వారా తక్కువ ధరలో తమకు కావాల్సిన ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఈ నెల ప్రారంభంలో జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 22 నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) రేట్లను తగ్గించాలని నిర్ణయించింది, దీని ఫలితంగా టెలివిజన్, ఇతర గృహోపకరణాల ధరలు తగ్గుతాయి. 32 అంగుళాల కంటే ఎక్కువ స్క్రీన్ పరిమాణం ఉన్న టీవీ సెట్‌లపై ప్రస్తుతం ఉన్న సుంకం 28 శాతాన్ని 18 శాతానికి తగ్గుతుంది. ఇప్పటికే ఎల్‌జీ, సోనీ, పానసోని సహా దిగ్గజ టీవీ బ్రాండ్లు సోమవారం నుంచి కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించాయి.

తాజా వివరాల ప్రకారం, సోనీ కంపెనీ బ్రావియా టీవీ మోడళ్లపై రూ. 5,000 నుంచి రూ. 71,000 వరకు తగ్గించింది. 55 అంగుళాల టీవీలపై రూ. 30 వేల వరకు, పెద్ద స్క్రీన్ కలిగిన టీవీలపై రూ. 70 వేల కంటే ఎక్కువ తగ్గింపు ప్రకటించింది. ఎల్‌జీ బ్రాండ్ సైతం తన అన్ని టీవీలపై రూ. 2,500 నుంచి రూ. 86,000 వరకు తగ్గించామని వెల్లడించింది. పానసోనిక్ కూడా ఎంఆర్‌పీ ధరపై రూ.3,000 నుంచి రూ.32,000 మధ్య తగ్గించింది.

Next Story