PwC India: అవసరమైతేనే ప్రయాణం చేయండి.. ఉద్యోగులకు పీడబ్ల్యూసీ సూచన

by S Gopi |

ప్రస్తుతం మారుతున్న గ్లోబల్ ఆర్థిక పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు కంపెనీ వివరించింది.

PwC India: అవసరమైతేనే ప్రయాణం చేయండి.. ఉద్యోగులకు పీడబ్ల్యూసీ సూచన
X

దిశ, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న ఇంధన ధరలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు కార్పొరేట్ సంస్థలు స్పందిస్తున్నాయి. మంగళవారం ప్రముఖ అకౌంటింగ్, కన్సల్టింగ్ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా తన ఉద్యోగులకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలను తగ్గించుకోవాలని సూచించింది. 'స్పష్టమైన వ్యాపార అవసరం' ఉన్నప్పుడే ప్రయాణాలు చేయాలని కంపెనీ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రస్తుతం మారుతున్న గ్లోబల్ ఆర్థిక పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు కంపెనీ వివరించింది. ఖర్చుల నియంత్రణ, బాధ్యతాయుత వినియోగం, ఉద్యోగుల శ్రేయస్సు మధ్య సమతుల్యతను కొనసాగించడమే లక్ష్యమని పీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్ సంజీవ్ కృష్ణన్ అన్నారు. మరోవైపు, కేవలం ప్రయాణాలకే పరిమితం కాకుండా, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగ్స్‌కు కూడా మళ్లీ ప్రాధాన్యం పెరుగుతోంది. ఇతర కంపెనీలు కూడా ఇలాంటి చర్యలపై దృష్టి పెడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ఐటీ, కన్సల్టింగ్ సంస్థలు ఇప్పటికే విదేశీ ప్రయాణాలను పరిమితం చేసి, వర్చువల్ మీటింగ్స్, హైబ్రిడ్ వర్క్ మోడళ్లకు అమలు చేయడంపై దృష్టి సారించాయి.

Next Story