- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trai: '1600' సిరీస్ నంబర్ అమలుకు గడువు విధించిన ట్రాయ్
గడువు నుంచి బీఎఫ్ఎస్ఐ సంస్థలు కస్టమర్లకు చేసే కాల్స్ అన్నీ కూడా 1600 సిరీస్ నంబర్ నుంచే చేయాలని స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాంకులతో పాటు ఎన్‌బీఎఫ్‌సీలు, మ్యూచువల్ ఫండ్లు, ఫైనాన్స్, ఇతర కంపెనీలకు సంబంధించిన కాల్స్ విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కీలక ప్రకటన విడుదల చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) రంగానికి చెందిన సేవలు, ప్రమోషనల్, లావాదేవీల కాల్స్ కోసం 1600 సిరీస్ నంబర్ వాడకంపై తుది గడువు విధించింది. నిర్దేశించిన గడువు నుంచి బీఎఫ్ఎస్ఐ సంస్థలు కస్టమర్లకు చేసే కాల్స్ అన్నీ కూడా 1600 సిరీస్ నంబర్ నుంచే చేయాలని స్పష్టం చేసింది. వాయిస్ కాల్స్ ద్వారా జరిగే ఆర్థిక మోసాలను అరికట్టే ప్రయత్నంలో భాగంగా ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఎవరి నుంచి కాల్స్ వస్తున్నాయనే విషయాన్ని వినియోగదారులు గుర్తించడం సులభమవుతుంది. ఇప్పటివరకు కొత్త సిరీస్ నంబర్‌తో కాల్స్ చేసేందుకు 485 సంస్థలు రిజిస్టర్ చేసుకున్నాయని ట్రాయ్ వెల్లడించింది.
ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగ కంపెనీలు, వాణిజ్య బ్యాంకులు 2026, జనవరి 1 నుంచి 1600 సిరీస్ నంబర్‌తో కాల్స్ అమలు చేయాలి. మ్యూచువల్ ఫండ్, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు మాత్రం ఫిబ్రవర్ 15 నుంచి ఈ నిర్ణయం అమలవుతుంది. సెబీ నమోదిత ఇంటర్మీడియరీస్ ఈ సిరీస్ నంబర్లకు మారడాన్ని స్వచ్ఛందంగా నిర్ణయించుకోవచ్చని ట్రాయ్ స్పష్టం చేసింది. ఇక, ఎన్‌బీఎఫ్‌సీలు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు, చిన్న సంస్థలకు మార్చి 1 వరకు గడువు ఉంది. పెన్షన్ ఫండ్ మేనేజర్లతో పాటు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు ఫిబ్రవరి 15 నాటికి ఈ సిరీస్ నంబర్లకు మారాలని వెల్లడించింది. బీమా రంగానికి సంబంధించి అమలుపై ఐఆర్‌డీఏఐతో చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయంపై ప్రకటన తర్వాత వెలువరించనున్నట్టు ట్రాయ్ పేర్కొంది.






