- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TRAI: ఫిర్యాదులు పరిష్కరించకపోతే రూ.50 లక్షల వరకు ఫైన్
ప్రతి టెలికాం ఆపరేటర్ తమ వెబ్‌సైట్, మొబైల్ యాప్, చాట్‌బాట్‌లలో ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని తప్పనిసరిగా కల్పించాలి.

దిశ, బిజినెస్ బ్యూరో: టెలికాం వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత కఠినతరం చేయాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్ణయించింది. ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడం లేదా సరిగా పరిష్కరించని టెలికాం కంపెనీలపై ప్రతి త్రైమాసికానికి రూ.50 లక్షల వరకు జరిమానా విధించేలా కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. 'టెలికాం కన్స్యూమర్ కంప్లైంట్స్ రిడ్రెస్సల్ రెగ్యులేషన్ (ఫోర్త్ అమెండ్‌మెంట్) 2026' పేరుతో విడుదల చేసిన ముసాయిదాలో వినియోగదారుల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడంపై ప్రధానంగా దృష్టి సారించింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం, ప్రతి టెలికాం ఆపరేటర్ తమ వెబ్‌సైట్, మొబైల్ యాప్, చాట్‌బాట్‌లలో ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని తప్పనిసరిగా కల్పించాలి. యూజర్లు ఫిర్యాదులు, సేవల అభ్యర్థనలు సులభంగా నమోదు చేసుకునే విధంగా వ్యవస్థ ఉండాలని ట్రాయ్ సూచించింది. అదనంగా, కంప్లైంట్ స్టేటస్ , తీసుకున్న చర్యలు, పరిష్కారానికి పట్టే సమయం వంటి వివరాలను కస్టమర్లకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. సరైన ఆప్షన్ లేకపోతే కస్టమర్లు ఎస్సెమ్మెస్ లేదా వాయిస్ నోట్ రూపంలో సమస్య వివరాలు పంపే అవకాశం కూడా ఇవ్వాలని ట్రాయ్ పేర్కొంది.
ఫిర్యాదుల ఆడిట్ సమయంలో నిర్లక్ష్యం బయటపడితే ప్రతి ఫిర్యాదుకు రూ.1,000, ప్రతి అప్పీల్‌కు రూ.5,000 జరిమానా విధించే ప్రతిపాదనను ట్రాయ్ తీసుకొచ్చింది. అయితే ఒక్కో టెలికాం సర్కిల్‌కు గరిష్ట జరిమానా రూ.50 లక్షలు వరకు ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా అన్ని టెలికాం కంపెనీలు తమ వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ప్రత్యేకంగా ‘కన్స్యూమర్ కార్నర్’ ఏర్పాటు చేసి, ఫిర్యాదుల సెంటర్, అప్పీలేట్ అథారిటీ, వినియోగదారుల సంతృప్తి సర్వేలు, త్రైమాసిక పనితీరు నివేదికల వివరాలను అందుబాటులో ఉంచాలని సూచించింది.






