- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jio: నిబంధనలు పాటించాలని జియోకు ట్రాయ్ ఆదేశాలు
ఈ ఆదేశాలను పాటించడానికి జియోకు ఏప్రిల్ 14 వరకు గడువు ఇచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోకు నియంత్రణ సంస్థ ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టారిఫ్ విధానాలతో పాటు పారదర్శకత నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించిన ట్రాయ్ ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను పాటించడానికి జియోకు ఏప్రిల్ 14 వరకు గడువు ఇచ్చింది. మింట్ నివేదిక ప్రకారం, జియో రెండు కీలక ఆదేశాలను పాటించట్లేదని ట్రాయ్ ఉత్తర్వుల్లో పేర్కొంది. కంపెనీ తన అన్ని ప్లాట్‌ఫామ్‌లలో టారిఫ్ ప్లాన్‌లను ఒకే విధంగా చూపాలని స్పష్టం చేసింది. కంపెనీ తన యాప్, వెబ్‌సైట్, స్టోర్‌లలో ఒకే రకమైన రీఛార్జ్ ప్లాన్‌లు, ధరలను చూపించాలి. వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లలో హైడ్ చేయడం, వేర్వేరు ప్లాన్‌లు ఉండకూడదు. గందరగోళానికి గురిచేసే లేదా తప్పుదోవ పట్టించేలా ధరలు ఉండకూడదు. అలాగే, కొన్ని ఆఫర్లను డివైజ్‌ను బట్టి మార్చొద్దని తెలిపింది. కొన్ని ప్లాన్‌లు కేవలం కొన్ని ఫోన్‌లు లేదా పరికరాలకే పరిమితం కాకూడదు. ఏదైనా ప్లాన్ కేవలం ఎంపిక చేసిన ఫోన్‌లలోనే కాకుండా, ఏ ఫోన్‌లోనైనా పనిచేయాలని ట్రాయ్ వెల్లడించింది. దీనికి సంబంధించి అన్ని నియంత్రణ మార్గదర్శకాలను పాటిస్తున్నామని జియో వివరణ ఇచ్చింది.






