రూపాయిల్లో వాణిజ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న దేశాలు

by Dishanational1 |
రూపాయిల్లో వాణిజ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న దేశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంతో భారత వాణిజ్య అత్యంత వేగంగా మారుతోంది. చాలా దేశాలు భారత కరెన్సీ రూపాయితో వాణిజ్యం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. వాటిలో బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు గల్ఫ్ ప్రాంతాలకు చెందిన దేశాలు కూడా ఉన్నాయి. రూపాయి కరెన్సీతో వాణిజ్యం చేయడం ద్వారా లావాదేవీల ఖర్చులను తగ్గించుకోవాలని ఆయా దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు రూపాయిలో వాణిజ్యం గురించి చర్చిస్తున్నాయి. ఈ పరిణామం ప్రపంచ వాణిజ్యంలో భారత్‌కు కీలక మైలురాయిగా మారనుందని గోయల్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తుతో మరిన్ని అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ జాబితాలో చేరతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది.

ఇప్పుడిప్పుడే దేశాలు తమ సొంత కరెన్సీలలో వ్యాపారం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తిస్తున్నాయని, స్థానిక కరెన్సీల మధ్య ప్రత్యక్ష లావాదేవీల వైపు మళ్లుతున్నాయని గోయల్ చెప్పారు. లావాదేవీల్లో ఇతర కరెన్సీలను వాడటం వల్ల ఆ కరెన్సీ మారకానికి డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల డబ్బు మార్చుకునేందుకు ఎక్కువ వ్యయం అవసరమవుతుంది. కాబట్టి స్థానిక కరెన్సీలో వాణిజ్య చాలా ఉపయోగపడుతుంది. దీనికోసం కొంత సమయం పడుతుందని తెలుసు, సెంట్రల్ బ్యాంకుల స్థాయిలో వ్యవస్థ ఏర్పాటు, ఎగుమతి, దిగుమతిదారుల ఆమోదం, అమలు కావాలని పీయుష్ గోయల్ వివరించారు. ఈ క్రమంలో రూపాయిలో వాణిజ్య ప్రారంభమైతే మరింత వేగవంతమవుతుందన్నారు. ఇతర కరెన్సీలతో పోల్చినప్పుడు భారత రూపాయి స్థిరంగా ఉంది. ఇది డాలర్ కొరతను ఎదుర్కొంటున్న దేశాలకు మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.


Next Story

Most Viewed