- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Toyota Kirloskar: దేశీయంగా టయోటా కిర్లోస్కర్ కొత్త ప్లాంట్
2029 ప్రథమార్థంలో ఈ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని, సుమారు 2,800 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ అంచనా వేస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ దిగ్గజం టయోటా కిర్లొస్కర్ మోటార్ దేశీయంగా మరో కొత్త తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. దీనికోసం భారీ పెట్టుబడికి సిద్ధమైనట్టు తెలిపింది. మహారాష్ట్రలోని బిడ్కిన్ పారిశ్రామిక ప్రాంతంలో కొత్త వాహన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2029 ప్రథమార్థంలో ఈ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని, సుమారు 2,800 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ కొత్త ప్లాంట్‌లో ఏటా లక్ష వాహనాలు తయారు చేసే సామర్థ్యం ఉంటుంది. ముఖ్యంగా కొత్త ఎస్‌యూవీ మోడల్ ఉత్పత్తిపై కంపెనీ దృష్టి పెట్టింది. స్టాంపింగ్, వెల్డింగ్, పెయింటింగ్, అసెంబ్లీ వంటి పూర్తి స్థాయి తయారీ ప్రక్రియలన్నీ ఈ యూనిట్‌లోనే జరుగుతాయని కంపెనీ వివరించింది. భారత మార్కెట్‌తో పాటు పలు అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్‌ను తీర్చడానికి ఈ విస్తరణ చేపడుతున్నట్లు టయోటా స్పష్టం చేసింది. ప్రస్తుతం టయోటా కిర్లోస్కర్ మోటార్ కర్ణాటకలోని బిడాదిలో రెండు ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఈ రెండు ప్లాంట్లు ఏడాదికి 3.42 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. కొత్త ప్లాంట్‌తో భారత్‌లో టయోటా ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగడంతో పాటు, దేశాన్ని కీలక తయారీ, ఎగుమతి కేంద్రంగా మారుస్తుంది.






