- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Toyota Kirloskar: ఫార్చునర్ ధరలను రూ. 87 వేల వరకు పెంచేసిన టయోటా కిర్లోస్కర్
ధరల సవరణ తర్వాత ఫార్చునర్ మోడల్ ధరలు ఇప్పుడు రూ. 34.76 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్‌కు రూ. 50.46 లక్షల వరకు చేరుకున్నాయి (ఎక్స్-షోరూమ్).

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ప్రీమియం ఎస్‌యూవీ ఫార్చ్యూనర్ ధరలను భారీగా పెంచేసింది. స్టాండర్డ్ ఫార్చునర్‌తో పాటు లెజెండర్, జీఆర్-ఎస్ వేరియంట్ల ధరలు గరిష్టంగా రూ. 87 వేల వరకు పెంచినట్టు కంపెనీ వెల్లడించింది. ధరల సవరణ తర్వాత ఫార్చునర్ మోడల్ ధరలు ఇప్పుడు రూ. 34.76 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్‌కు రూ. 50.46 లక్షల వరకు చేరుకున్నాయి (ఎక్స్-షోరూమ్). ఈ పెంపు ముఖ్యంగా ఫార్చునర్ జీఆర్-ఎస్ 4X4 ఆటోమేటిక్ వేరియంట్‌పై ఎక్కువ ప్రభావం పడింది. ఈ మోడల్ ధర రూ. 87 వేల మేర పెరిగింది. అదే సమయంలో, లెజెండర్ వేరియంట్ల ధరలు కూడా రూ. 75 వేల నుంచి రూ. 83 వేల వరకు పెరిగాయి. స్టాండర్డ్ ఫార్చునర్ వేరియంట్లలో పెట్రోల్ ఆటోమేటిక్ 4X2, డీజిల్ మాన్యువల్ 4X2 వేరియంట్లకు రూ. 60 వేల పెంపు నమోదైంది. ప్రధానంగా వాయన తయారీలో కీలకమైన విడి భాగాలు, ఇతర ఇన్‌పుట్ ఖర్చుల భారంతో ధరలు పెంచాలని కంపెనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.






