- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Swiggy: తక్కువ ధరలో ఫుడ్ డెలివరీ 'టోయింగ్' సేవలు ప్రారంభించిన స్విగ్గీ
ఈ యాప్‌ను నుంచి చేసే మీల్స్ రూ. 100-105 ధరకే లభిస్తుందని, కస్టమర్ల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయమని స్విగ్గీ పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఫుడ్ డెలివరీ వ్యాపారంలో పోటీ పెరిగిన నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ సరికొత్త స్పెషల్ డెలివరీ యాప్‌ను తీసుకొచ్చింది. 'టోయింగ్' పేరుతో ప్రారంభించిన ఈ ప్రత్యేక యాప్ సేవలు ప్రస్తుతానికి పూణెలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా యువత, విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దీని సేవలు అందించాలని స్విగ్గీ నిర్ణయంచింది. ఈ యాప్‌ను నుంచి చేసే మీల్స్ రూ. 100-105 ధరకే లభిస్తుందని, కస్టమర్ల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయమని స్విగ్గీ పేర్కొంది. ఇప్పటికే వివిధ రకాల డెలివరీ యాప్ సేవలను స్విగ్గీ అందిస్తోంది. స్విగ్గీతో పాటు ఇన్‌స్టామార్ట్, డైన్-ఔట్, స్నాక్, పింగ్, క్రూతో పాటు కొత్తగా టోయింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. అయితే, సాధారణంగా కొత్త యాప్ సేవలను బెంగళూరు నుంచి ప్రారంభించే స్విగ్గీ, ఈసారి టోయింగ్ సేవలను పూణెలో లాంచ్ చేయడం విశేషం. ఈ నగరంలో యువత, విద్యార్థులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని కంపెనీ భావిస్తోంది. కాగా, గత కొన్ని నెలలుగా ఫుడ్ డెలివరీ సేవలను విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ మధ్య క్యాబ్ సేవలందించే ర్యాపిడో 'ఓన్లీ' పేరుతో ఫుడ్ డెలివరీ సేవల్లోకి అడుగుపెట్టింది. ఈ విభాగంలో జొమాటో, స్విగ్గీలతో పోటీ కోసం ర్యాపిడో జీరో కమిషన్ విధానంలో సేవలు మొదలుపెట్టిది. ఈ క్రమంలోనే స్విగ్గీ కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త రకం డెలివరీ సేవలపై దృష్టి సారించింది.






