Today Gold, Silver Rates: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold, Silver Rates: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.91,400గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.99,710 గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,25,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.91,400

24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,710

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.91,400

24 క్యారెట్ల బంగారం ధర – రూ.99,710

Next Story