Today Gold, Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. ఒక్కరోజే రూ.3000 పెరిగిన ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది.

Today Gold, Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. ఒక్కరోజే రూ.3000 పెరిగిన ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే భారతదేశంలో పసిడికి కొంచెం మక్కువ ఎక్కువే. ఒంటినిండా నగలతో సింగారించుకుని మహిళలు తెగ సంబరపడిపోతుంటారు. ఇక డబ్బున్నోళ్లు ఎలా అయినా బంగారం కొనుగోలు చేసి ధరిస్తారు. కానీ సామాన్య ప్రజలు గ్రాముల్లో అయినా తీసుకొని హ్యాపీగా ఫీలవుతుంటారు. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.

దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.99,600 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.91,300 వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ వెండిపై రూ.మూడు వేలు(3,000) పెరిగి ధర రూ.1,17,000కు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు కాస్త అటు ఇటుగా ఇవే ధరలు ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.91,300

24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,600

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.91,300

24 క్యారెట్ల బంగారం ధర – రూ.99,600

Next Story