- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold, Silver Rates: గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ వేళ తగ్గిన ధరలు..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పెరిగి బిగ్ షాకిస్తుంటే మరో రోజు తగ్గి రిలీఫ్‌ను కలిగిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పెరిగి బిగ్ షాకిస్తుంటే మరో రోజు తగ్గి రిలీఫ్‌ను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ఇక సిల్వర్ విషయానికి వస్తే ఈ రోజు కూడా ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో నేడు కొత్త సంవత్సరం సందర్భంగా ధరలు తగ్గడంతో సామాన్య ప్రజలు కొంత ఊపిరిపీల్చుకున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,23,650 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.150 పెరిగి రూ.1,23,800 గా ఉంది. అలాగే నిన్న రూ.1,34,890 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.170 పెరిగి రూ.1,35,060కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.1000 తగ్గి కిలో రూ.2,56,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,23,800
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,35,060
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,23,800
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,35,060






