Today Gold, Silver Rates: హమ్మయ్యా.. ఎట్టకేలకు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

by I. Sairam |   (  Updated:2025-12-29 05:32:17  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold, Silver Rates: హమ్మయ్యా.. ఎట్టకేలకు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరలు పెరుగుతున్నాయే కానీ తగ్గడంలేదు. అలా గోల్డ్ రేట్స్ లక్షా యాభై వేలకు చేరువలో ఉండగా.. వెండి మాత్రం 3లక్షలకు చేరువలో ఉంది. దీంతో గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని సామాన్య ప్రజలు ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,30,550 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.650 తగ్గి రూ.1,29,900 గా ఉంది. అలాగే నిన్న రూ.1,42,420 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.710 తగ్గి రూ.1,41,710కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.4000 తగ్గి కిలో రూ.2,81,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,29,900

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,41,710

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,29,900

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,41,710

Next Story