Today Gold, Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. రెండో రోజు కూడా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-11 14:46:56  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పెరిగి బిగ్ షాకిస్తుంటే మరో రోజు తగ్గి రిలీఫ్‌ను కలిగిస్తున్నాయి.

Today Gold, Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. రెండో రోజు కూడా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పెరిగి బిగ్ షాకిస్తుంటే మరో రోజు తగ్గి రిలీఫ్‌ను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో నిన్నటి నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు భారీగా పెరిగి బిగ్ షాకిస్తున్నాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,26,700 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.550 పెరిగి రూ.1,27,250 గా ఉంది. అలాగే నిన్న రూ.1,38,220 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.600 పెరిగి రూ.1,38,820కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.6000 పెరిగి కిలో రూ.2,71,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,27,250

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,38,820

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,27,250

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,38,820

Next Story