- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: సూపర్ గుడ్ న్యూస్..నేడు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. కానీ గత మూడు రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,600 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.500 తగ్గి రూ.90,100గా ఉంది. అలాగే నిన్న రూ.98,830 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.540 తగ్గి రూ.98,290 గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,20,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,100
24 క్యారెట్ల బంగారం ధర - రూ.98,290
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,100
24 క్యారెట్ల బంగారం ధర – రూ.98,290






