Today Gold Rates: పసిడి ప్రియులకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-11 05:09:43  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నిన్నని నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు హమ్మయ్య అని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.94,450 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.700 తగ్గి రూ.93,750గా ఉంది. అలాగే నిన్న రూ.1,03,040 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.760 తగ్గి రూ.1,02,280గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,27,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.93,750

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,02,280

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.93,750

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,02,280

Next Story