Today Gold Rates: షాకింగ్ న్యూస్.. నేడు పెరిగిన బంగారం ధరలు..

by I. Sairam |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: షాకింగ్ న్యూస్.. నేడు పెరిగిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నిన్న భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. దీంతో పసిడి ప్రియులు అమ్మో అనుకుంటున్నారు. ఈ క్రమంలో నేడు గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.92,900 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.50 పెరిగి రూ.92,950గా ఉంది. అలాగే నిన్న రూ.1,01,350 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.50 పెరిగి రూ.1,01,400గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,23,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.92,950

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,400

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.92,950

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,400


Next Story