Today Gold Rates: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. దీంతో పసిడి ప్రియులు వామ్మో అని అనుకుంటున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,200 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.550 పెరిగి రూ.90,750గా ఉంది. అలాగే నిన్న రూ.98,400 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.600 పెరిగి రూ.99,000 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.1000 పెరిగి కిలో రూ.1,21,100గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,750

24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,000

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,750

24 క్యారెట్ల బంగారం ధర – రూ.99,000

Next Story