Today Gold, Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు రూ.5 వేలు పెరిగిన ధరలు

by I. Sairam |   (  Updated:2026-02-13 02:11:42  IST  )

ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.1,23,000గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.1,34,180కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.5000 పెరిగి కిలో రూ.2,26,000గా ఉంది.

Today Gold, Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు రూ.5 వేలు పెరిగిన ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ వెండి ధరలు మాత్రం ఏకంగా ఐదు వేల రూపాయలు పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.1,23,000గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.1,34,180కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.5000 పెరిగి కిలో రూ.2,26,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,23,000

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,34,180

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,23,000

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,34,180

Next Story