Today Gold Rates: పసిడి ప్రియులకు హ్యాపీ న్యూస్.. నేడు కూడా భారీగా తగ్గిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-30 05:15:12  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు హ్యాపీ న్యూస్.. నేడు కూడా భారీగా తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. కానీ గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతూ సామాన్య ప్రజలకు బాగా ఊరటనిచ్చాయి. అయితే నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్ ఈ రోజు మాత్రం భారీగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతూ బంగారం షాపులకు బారులు తీరుతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.89,300 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.150 తగ్గి రూ.89,150గా ఉంది. అలాగే నిన్న రూ.97,420 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.160 తగ్గి రూ.97,260 గా ఉంది. ఇక అటు వెండి ధర కిలోకు రూ.100 తగ్గి రూ.1,17,700గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.89,150

24 క్యారెట్ల బంగారం ధర - రూ.97,260

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.89,150

24 క్యారెట్ల బంగారం ధర – రూ.97,260

Next Story