Today Gold Rates: గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఫుల్ ఖుషీలో పసిడి ప్రియులు

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఫుల్ ఖుషీలో పసిడి ప్రియులు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నిన్న పెరిగి బిగ్ షాకిచ్చాయి. అయితే నేడు పసిడి ధరలు భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్ని ఇచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.92,100 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.400 తగ్గి నేడు రూ.91,700గా ఉంది. అలాగే నిన్న రూ.1,00,480 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.450 తగ్గి రూ.1,00,030 గా ఉంది. ఇక అటు వెండి ధరపై రూ.2000 తగ్గి కిలో రూ.1,25,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.91,700

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,00,030

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.91,700

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,00,030

Next Story