- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: గుడ్ న్యూస్.. రెండో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు.. ఫుల్ ఖుషీలో పసిడి ప్రియులు
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నిన్నటి నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో నేడు కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.92,700 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.200 తగ్గి నేడు రూ.91,500గా ఉంది. అలాగే నిన్న రూ.1,00,030 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.210 తగ్గి రూ.99,820 గా ఉంది. ఇక అటు వెండి ధరపై రూ.2000 తగ్గి కిలో రూ.1,23,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.91,500
24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,820
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.91,500
24 క్యారెట్ల బంగారం ధర – రూ.99,820






