Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన గోల్డ్ రేట్స్.. ఫుల్ ఖుషీలో పసిడి ప్రియులు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన గోల్డ్ రేట్స్.. ఫుల్ ఖుషీలో పసిడి ప్రియులు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు నిన్నటి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు కూడా స్వల్పంగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు హమ్మయ్య అని అనుకుంటున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,100 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.10 తగ్గి రూ.89,990గా ఉంది. అలాగే నిన్న రూ.98,180 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.10 తగ్గి రూ.98,170 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.100 పెరిగి కిలో రూ.1,20,100గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.89,990

24 క్యారెట్ల బంగారం ధర - రూ.98,170

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.89,990

24 క్యారెట్ల బంగారం ధర – రూ.98,170

Next Story