- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పెరిగి బిగ్ షాకిస్తుంటే మరో రోజు తగ్గి రిలీఫ్‌ను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు గోల్డ్ రేట్లు భారీగా తగ్గితే సిల్వర్ రేట్లు మాత్రం పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,32,000 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.750 తగ్గి రూ.1,31,250 గా ఉంది. అలాగే నిన్న రూ.1,44,000 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.820 తగ్గి రూ.1,43,180కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.3000 పెరిగి కిలో రూ.3,10,000గా ఉంది. కాగా రెండు రోజుల్లో కేజీ వెండి ధర రూ.20,000 పెరగడం గమనార్హం.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,31,250
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,43,180
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,31,250
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,43,180






