Today Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-15 04:50:44  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో పసిడి ప్రియులు హమ్మయ్య అని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.92,900 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.10 తగ్గి రూ.92,890గా ఉంది. అలాగే నిన్న రూ.1,01,350 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.10 తగ్గి నేడు రూ.1,01,340గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.100 పెరిగి కిలో రూ.1,26,100గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.92,890

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,340

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.92,890

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,340

Next Story