Today Gold Rates: వరలక్ష్మి వ్రతం రోజు మహిళకు బిగ్ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-08 04:50:48  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: వరలక్ష్మి వ్రతం రోజు మహిళకు బిగ్ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ ఈ రోజు కూడా భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. దీంతో పసిడి ప్రియులు అమ్మో అనుకుంటున్నారు. అంతేకాకుండా పెళ్లిళ్ల సీజన్లో ఇలా గోల్డ్ రేట్స్ ఇంక్రీస్ అవ్వడంతో వధువు పేరెంట్స్ నిరాశకు గురి అవుతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.94,400 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.700 పెరిగి రూ.94,700గా ఉంది. అలాగే నిన్న రూ.1,02,550 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.760 పెరిగి రూ.1,03,310గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,27,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.94,700

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,03,310

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.94,700

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,03,310

Next Story