Today Gold Rates: ముచ్చటగా మూడో రోజు కూడా భగ్గుమన్న బంగారం ధరలు.. మరోసారి లక్ష దాటిన గోల్డ్ రేట్..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: ముచ్చటగా మూడో రోజు కూడా భగ్గుమన్న బంగారం ధరలు.. మరోసారి లక్ష దాటిన గోల్డ్ రేట్..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు గత రెండు రోజుల నుంచి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు కూడా భారీగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.91,100 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.600 పెరిగి రూ.91,700గా ఉంది. అలాగే నిన్న రూ.99,380 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.660 పెరిగి రూ.1,00,040 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.2,100 పెరిగి కిలో రూ.1,26,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.91,700

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,00,040

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.91,700

24 క్యారెట్ల బంగారం ధర – రూ.,1,00,040

Next Story