Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-13 07:58:19  IST  )

నేడు బంగారం ధరలు కాస్త తగ్గి పసిడి ప్రియులకు ఊరటనిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,15,350 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.300 తగ్గి రూ.1,15,050గా ఉంది.

Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత మూడు రోజులుగా గోల్డ్ రేట్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు కాస్త తగ్గి పసిడి ప్రియులకు ఊరటనిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,15,350 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.300 తగ్గి రూ.1,15,050గా ఉంది. అలాగే నిన్న రూ.1,25,840 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.330 తగ్గి రూ.1,25,510కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.3000 పెరిగి కిలో రూ.1,73,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,15,050

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,25,510

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,15,050

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,25,510

Next Story