Today Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. వరుసగా రెండో రోజు కూడా జోరందుకున్న బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. వరుసగా రెండో రోజు కూడా జోరందుకున్న బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. కానీ గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతూ సామాన్య ప్రజలకు బాగా ఊరటనిచ్చాయి. అయితే నిన్న భారీగా పెరిగి బిగ్ షాక్ ఇచ్చాయి. ఈ క్రమంలో వరుసగా రెండో రోజు కూడా గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,200 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.10 పెరిగి రూ.90,210గా ఉంది. అలాగే నిన్న రూ.98,400 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.10 పెరిగి రూ.98,410 గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,20,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,210

24 క్యారెట్ల బంగారం ధర - రూ.98,410

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,210

24 క్యారెట్ల బంగారం ధర – రూ.98,410

Next Story