- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. నేడు పెరిగిన బంగారం ధరలు..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. కానీ గత మూడు రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,500 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.100 పెరిగి రూ.90,600గా ఉంది. అలాగే నిన్న రూ.98,730 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.100 పెరిగి రూ.98,830 గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,20,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,600
24 క్యారెట్ల బంగారం ధర - రూ.98,830
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,600
24 క్యారెట్ల బంగారం ధర – రూ.98,830






