Today Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెయ్యికి తగ్గడంతో ఫుల్ ఖుషీ..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెయ్యికి తగ్గడంతో ఫుల్ ఖుషీ..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. కానీ గత మూడు రోజులుగా గోల్డ్ రేట్స్ భారీగా పెరిగి బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు పసిడి రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరికి బిగ్ రిలీఫ్ కలిగింది. ఎందుకంటే ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.91,050 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.550 తగ్గి రూ.90,500గా ఉంది. అలాగే నిన్న రూ.99,330 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.600 తగ్గి రూ.98,730 గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1000 తగ్గి రూ.1,20,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,500

24 క్యారెట్ల బంగారం ధర - రూ.98,730

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,500

24 క్యారెట్ల బంగారం ధర – రూ.98,730

Next Story