- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ ఊపందుకున్న బంగారం ధరలు..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఓ సారి లక్ష దాటి షాక్ ఇచ్చిన పసిడి ధరలు ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. కానీ గత రెండు రోజులుగా భారీగా పెరిగి మరోసారి లక్ష దాటిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. ఈ క్రమంలో నిన్న భారీగా తగ్గి ఊరటనిచ్చిన గోల్డ్ రేట్స్ నేడు స్వల్పంగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.92,000 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.500 పెరిగి రూ.92,500గా ఉంది. అలాగే నిన్న రూ.1,00,370గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై రూ.540 పెరిగి నేడు రూ.1,00,910 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.1000 పెరిగి కిలో రూ.1,21,000కు చేరుకుంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.92,500
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,00,910
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.92,500
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,00,910






