Today Gold Rate: మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-28 04:40:32  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది.

Today Gold Rate: మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.89,950 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.600 తగ్గి రూ.89,350 ఉంది. అలాగే నిన్న రూ.98,130 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.650 తగ్గి రూ.97,480 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు కిలో రూ. 1,11,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.89,350

24 క్యారెట్ల బంగారం ధర - రూ.97,480

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.89,350

24 క్యారెట్ల బంగారం ధర – రూ.97,480

Next Story