Today Gold Rate: పసిడి ప్రియులకు ఎగిరిగంతేసే న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rate: పసిడి ప్రియులకు ఎగిరిగంతేసే న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే భారతదేశంలో పసిడికి కొంచెం మక్కువ ఎక్కువే. ఒంటినిండా నగలతో సింగారించుకుని మహిళలు తెగ సంబరపడిపోతుంటారు. ఇక డబ్బున్నోళ్లు ఎలా అయినా బంగారం కొనుగోలు చేసి ధరిస్తారు. కానీ సామాన్య ప్రజలు గ్రాముల్లో అయినా తీసుకొని హ్యాపీగా ఫీలవుతుంటారు. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.

దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నిన్న రూ.97,970 ఉండగా నేడు రూ.280 తగ్గి రూ.97,690 గా ఉంది.. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర నిన్న రూ.89,800 వద్ద ఉండగా నేడు రూ.250 తగ్గి రూ.89,550గా వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.1000 తగ్గి రూ.1,17,000కు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు కాస్త అటు ఇటుగా ఇవే ధరలు ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.89,550

24 క్యారెట్ల బంగారం ధర - రూ.97,690

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.88,550

24 క్యారెట్ల బంగారం ధర – రూ.97,690

Next Story