- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ambani: అంబానీని అధిగమించిన టిక్‌టాక్ బిలియనీర్
ప్రస్తుతం 117.4 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: టిక్‌టాక్ మాతృసంస్థ ‘బైట్‌డాన్స్’ మార్కెట్ విలువ పెరగడంతో ఆ సంస్థ సహ-వ్యవస్థాపకుడు జంగ్ యిమింగ్ ఆసియాలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, జంగ్ నికర సంపద ఒక్కసారిగా 92.8 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో దేశీయ దిగ్గజం ముఖేష్ అంబానీని (86.9 బిలియన్ డాలర్ల) అధిగమించి టాప్-2కి చేరుకున్నారు. ప్రస్తుతం 117.4 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 2019లో జంగ్ సంపద కేవలం 13 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండేది. గడిచిన ఏడేళ్లలో ఇది ఏడు రెట్లకు పైగా పెరగడం విశేషం. టిక్‌టాక్ అంతర్జాతీయంగా సక్సెస్ కావడంతో పాటు, కంపెనీ ఇటీవల తెచ్చిన డౌబావో ఏఐ చాట్‌బాట్ నెలకు 300 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లతో పాపులర్ కావడంతో బైట్‌డ్యాన్స్‌కు కలిసొచ్చింది. ఇటీవల అమెరికాలో కంపెనీ కార్యకలాపాలపై అనిశ్చితి నెలకొనడం, అనంతరం బైట్‌డ్యాన్స్ అమెరికాలో తమ వ్యాపారాన్ని, ఒరాకిల్ నేతృత్వంలోని కన్సార్షియంకు బదిలీ చేసింది. దీంతో కంపెనీకి అంతర్జాతీయంగా భారీ ఊరట లభించింది. ఈ మార్పులతో బ్లాక్‌రాక్, ఫిడిలిటీ సహా గ్లోబల్ ఇన్వెస్టర్లు కంపెనీ విలువను భారీగా పెంచడంతో, జంగ్ వ్యక్తిగత సంపద ఒకేసారి 24 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది.






