60 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. 100km మైలేజ్..USB చార్జింగ్ ఆప్షన్ కూడా!

by velandi.Saikiran |

జెలోమార్కెట్లో దీని ధర రూ. 59,990 గా ఫిక్స్ చేశారు. ఈ స్కూటర్ ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే దాదాపు 100 కిలోమీటర్ల మైలేజ్

60 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. 100km మైలేజ్..USB చార్జింగ్ ఆప్షన్ కూడా!
X

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే దీనికి తగ్గట్టుగానే రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలు మరికొన్ని మార్కెట్లోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో లాంచ్ అయింది. ప్రముఖ స్టార్టప్ జెలో ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకువచ్చింది. సామాన్యులు కూడా కొనుగోలు చేసే ధరలో... లాంచ్ చేశారు.

జెలో ఎలక్ట్రిక్ నైట్ ( Zelo Electric Knight ) ఇండియన్ మార్కెట్లో దీని ధర రూ. 59,990 గా ఫిక్స్ చేశారు. ఈ స్కూటర్ ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే దాదాపు 100 కిలోమీటర్ల మైలేజ్ కూడా అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఆగస్టు 20వ తేదీ నుంచి ఈ స్కూటర్ డెలివరీ కూడా ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రత్యేకంగా ఈ స్కూటర్ లో USB చార్జింగ్ పోర్ట్ కూడా అందిస్తున్నారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 6 కలర్స్ లో లభించనుంది.

బ్లాక్, వైట్ తో పాటు మరో నాలుగు డ్యూయల్ టోన్ కలర్స్ ఉన్నాయి. జీలో ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.5kw మోటర్ పనిచేస్తున్న నేపథ్యంలో 55 కిలోమీటర్ల వేగంతో ఈ బైక్ దూసుకు వెళ్తుంది. 1.8kwh పోర్టబుల్ బ్యాటరీ కూడా అందిస్తున్నారు. అన్ని బైక్స్ తరహా లోనే రిమోట్ కి కూడా దీనికి అందిస్తున్నారు. సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ప్రత్యేక ఫీచర్ గా ఉంది. జెలో డీలర్ షిప్ కూడా కంపెనీ ఇస్తుంది. దానికోసం కంపెనీ ప్రతిధులను కలవాల్సి ఉంటుంది.

Next Story