- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Loan: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ. 50 లక్షల లోన్ కావాలంటే ఇలా అప్లై చేసుకోవచ్చు..!!
Loan:కేంద్రంలోని మోడీ ప్రభుత్వం షెడ్యూల్ కులాల కోసం ఉద్దేశించిన రుణ స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

దిశ, వెబ్ డెస్క్: Loan: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం షెడ్యూల్ కులాల కోసం ఉద్దేశించిన రుణ స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్కీం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSFDC) టర్మ్ లోన్ రూపంలో అందిస్తోంది. ఈ స్కీం ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యాపారులకు ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా స్వయం ఉపాధి కోసం చూసేవారికి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్కీం ద్వారా అప్లై చేసుకోవడానికి అభ్యర్థి షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. అలాగే వారికి వార్షిక ఆదాయం మూడు లక్షల లోపు ఉండాలి. దీనికి తోడు వీరికి రుణపరిమితి ప్రాజెక్టు ఖర్చులో 95 శాతం వరకు లభిస్తుంది దీనిపై అత్యల్పంగా 6% వడ్డీ రేటును నిర్ణయించారు. అయితే ఆరు శాతం వడ్డీ కోసం ఐదు లక్షల రూపాయల లోపు రుణం తీసుకోవాలి.
ఇంకా అలాగే ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు రుణం పొందాలి అనుకున్నట్లయితే వీరు ఎంపిక చేసుకున్న ప్రాజెక్టు ఖర్చులో 95% వరకు రుణం లభిస్తుంది. అలాగే వీరికి వడ్డీ రేటు 8% గా ఉంది. దీంతోపాటు 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయల రుణం కోసం ప్రాజెక్టు ఖర్చులో 95% రుణం రూపంలో లభిస్తుంది. వీరికి వడ్డీ రేటు 9% గా నిర్ణయించారు. ఈ స్కీం ద్వారా రుణ చెల్లింపు గరిష్టంగా 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రతినెల ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చు.
ఈ రుణం కోసం అప్లై చేసుకోవాలంటే, https://nsfdc.nic.in/en/term-loan వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్‌బుక్, ప్రాజెక్ట్ రిపోర్ట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. ఈ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లుగా చెప్పవచ్చు. వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు గ్రామీణ ప్రాంతాల వారికి, రూ.2 లక్షల లోపు పట్టణ ప్రాంతాల వారికి మాత్రమే ఈ సబ్సిడీ అందుబాటులో ఉంది. అయితే మొత్తం ప్రాజెక్టు పైన మార్జిన్ మనీ గ్రాంట్ (సబ్సిడీ) అందుబాటులో ఉంటుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ అందిస్తున్నాయి.






