వారెవ్వా ‘పేరు’ తెచ్చిన అదృష్టం.. ఆ కంపెనీలో ఏకంగా రూ.4,300 కోట్ల పెట్టుబడులు

by Kema Shiva Kumar |

రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడగా.. భారత స్టాక్ మార్కెట్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది.

వారెవ్వా ‘పేరు’ తెచ్చిన అదృష్టం.. ఆ కంపెనీలో ఏకంగా రూ.4,300 కోట్ల పెట్టుబడులు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడగా.. భారత స్టాక్ మార్కెట్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది. ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా IPO బంపర్ లిస్టింగ్‌తో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. స్టాక్ ఎక్స్ఛేంజీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, ఎల్‌జీ బాలకృష్ణన్‌ అండ్‌ బ్రోస్‌ లిమిటెడ్‌ కంపెనీల పేరుతో స్టాక్స్ రన్ అవుతున్నాయి. అయితే, ఇక్కడే బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మంగళవారం ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ బంపర్ లిస్టింగ్ ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్లను కొనగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. కానీ, వారంతా గందరగోళంలో పొరపాటున ఎల్‌జీ బాలకృష్ణన్‌ అండ్‌ బ్రోస్‌ లిమిటెడ్‌ కంపెనీ షేర్లను పెద్ద ఎత్తున కొనేశారు. ఫలితంగా ఆ కంపెనీ షేర్ల విలువ ఒక్క రోజే 15 శాతం పెరిగాయి. ఇప్పటి వరకు ఎల్‌జీ బాలకృష్ణన్‌ అండ్‌ బ్రోస్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఇన్వెస్టర్లు కొనుగోలు చేసిన షేర్ల విలువ 4,300 కోట్లు కావడం విశేషం.

Next Story