- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరుగులు పెడుతున్న పుత్తడి ధర.. 10 గ్రాములు ఎంతంటే?
బంగారం ధరలు జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం (Gold) ధరలు జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాయి. ఇవాళ హైదరాబాద్‌లో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,700కు చేరింది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,95,000కు రీచ్ అయింది. అంతర్జాతీయ పరిణామాలు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో పుత్తడి రికార్డు స్థాయిలో పరుగులు పెడుతోందని ఆర్థిక విశ్లేషకులు తెలిపారు. ఇక ధన త్రయోదశి (Dhana Triodashi) డిమాండ్‌తో ఈ వీకెండ్‌లో గోల్డ్ ధరలు దేశవ్యాప్తంగా రూ.1.30 లక్షలు దాటే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,200 పలుకుతోంది. 2026 ప్రారంభం నాటికి గొల్డ్ రేటు రూ.1.50 లక్షలకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 4,071.50 డాలర్లుగా ఉండగా.. ఈ వీకెండ్‌కు ఔన్సు ధర 4,150 నుంచి 4,250 డాలర్లు చేరే అవకాశమూ లేకపోలేదు.






