- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Old Tax Regime: పాత పన్ను విధానం రద్దుతో గందరగోళం..క్లారిటీ ఇదిగో
Old Tax Regime: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..మధ్య తరగతి ఆదాయ వర్గానికి కొత్త పన్ను విధానంలో భారీ రాయితీలు ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: Old Tax Regime: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..మధ్య తరగతి ఆదాయ వర్గానికి కొత్త పన్ను విధానంలో భారీ రాయితీలు ప్రకటించారు. అయితే దీని వల్ల పాత పన్ను విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయనుందా అనే సందేహం చాలా మందిలో నెలకొంది. బడ్జెట్ ప్రసంగంలో పాత పన్ను విధానం గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. బడ్జెట్ పత్రంలో కూడా దీనిపై స్పష్టమైన ప్రకటన కూడా లేదు. అయితే ఇందులో సవరించిన పన్ను స్లాబ్స్ కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికే వర్తిస్తాయని పేర్కొన్నారు.
పాత పన్ను విధానం ప్రధానంగా హౌస్ రెంట్ అలవెన్స్, జీవిత బీమా ప్రీమియంలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో పెట్టుబడులు, వైద్య బీమా పాలసీలకు పన్ను మినహాయింపులు కోరుకునే పన్ను చెల్లింపు దారులకు ఉపయోగపడుతుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారికోసం మినహాయింపులను తీసివేసిన తర్వాతే పన్ను ఆదాయాన్ని లెక్కిస్తారు.
ఈ పన్ను చెల్లింపుకు అనుసరించే స్లాబ్స్:
రూ. 2.5 లక్షల వరకు - పన్ను లేదు
రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు - 5శాతం పన్ను
రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు - 5శాతం పన్ను
రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు - 20శాతం పన్ను
రూ. 10 లక్షలపైగా - 30శాతం పన్ను
2020-21 ఆర్థిక సంవత్సరంలో మోదీ సర్కార్ ఈ కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీర్ఘకాలికంగా పన్ను మినహాయింపులను తొలగించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. కొత్త పన్ను విధానం తీసుకువచ్చిన తర్వాత కూడా చాలా మంది పాత పన్ను విధానాన్నే కొనసాగిస్తూ మినహాయింపులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ ఆప్షన్ గా నిర్ణయించింది. పాత పన్ను విధానాన్ని కొనసాగించాలని భావించే పన్ను చెల్లింపుదారులు ప్రత్యేకంగా దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది బడ్జెట్ లో కొత్త పన్ను విధానంపై ప్రయోజనాలను ప్రకటించినప్పటికీ పాత పన్ను విధానంపై ఎలాంటి స్పష్టత లేదు. అందకే త్వరలోనే కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వచ్చి, పాత విధానాన్ని పూర్తిగా తొలగించవచ్చన్న ఊహాగాలు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్స్ లో 72శాతం మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. తాజా రాయితీల తర్వాత మరింత మంది కొత్త విధానాన్ని అనుసరించే అవకాశం ఉంటుంది.
పాత వర్సెస్ కొత్త పన్ను విధానం మధ్య తేడాలు?
ఉదాహరణకు రూ. 16లక్షల వార్షిక ఆదాయాన్ని తీసుకుంటే రెండు విధానాల మధ్య ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకుందాం.
కొత్త పన్ను విధానం ప్రకారం:
రూ. 4 లక్షల వరకు - పన్ను లేదు
రూ. 4 లక్షల నుండి రూ. 8 లక్షల వరకు - 5% (రూ. 20,000)
రూ. 8 లక్షల నుండి రూ. 12 లక్షల వరకు - 10% (రూ. 40,000)
రూ. 12 లక్షల నుండి రూ. 16 లక్షల వరకు - 15% (రూ. 60,000)
మొత్తం చెల్లించాల్సిన పన్ను - రూ. 1,20,000
కొత్త బడ్జెట్ లో సవరించిన రాయితీల కారణంగా ప్రస్తుతం చెల్లించాల్సి పన్ను కంటే రూ. 50,000 తక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
పాత పన్ను విధానం:
రూ. 16 లక్షల ఆదాయంపై రూ. 4లక్షల మినహాయింపులు తీసుకుంటే పన్ను విధించే ఆదాయం రూ. 12లక్షలు అవుతుంది. పాత పన్ను విధానం ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ. 1,72,500 అవుతుంది. అంటే కొత్త విధానంతో పోల్చితే రూ. 52,000 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. పాత విధానాలను వదిలి కొత్త విధానాన్ని ఎంచుకోవాలా లేదా అనేది వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
పాత వర్సెస్ కొత్త పన్ను విధానం
కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లయితే పన్ను ప్రయోజనాలను పొందేందుకు పీపీఎఫ్, బీమా పాలసీలలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. దీని వల్ల ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు మిగిలి...వారు తమ సొంత ఇష్టానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుంది. ప్రభుత్వం కూడా దీని ద్వారా ప్రజల వినియోగ శక్తిని పెంచి ఆర్థిక వ్రుద్ధిని మరింత పెంచాలనే ప్రయత్నం చేస్తోంది. దీనివల్ల ప్రతికూలత ఏంటంటే కొత్త విధానం సామాజిక భద్రతకు సంబంధించి పెట్టుబడులను నిరుత్సాహపరచడం అని చెప్పవచ్చు. మెడిక్లెయిమ్స్, పీపీఎఫ్ వంటి పొదుపు పథకాలు, తగ్గిపోవడం వల్ల ప్రజలు భవిష్యత్తులో ఆర్థిక అత్యవసర అవాంఛనీయ ఘటనలను ఎదుర్కునే అవకాశాలు తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏ విధానం మీకు ఉత్తమమైందో కచ్చితంగా అంచనా వేసి నిర్ణయం తీసుకోవడం మంచిది.






