- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
M&M: ఎంఅండ్ఎం బంపర్ ఆఫర్.. అదనంగా రూ. లక్ష పైన డిస్కౌంట్లు
మార్కెట్లో పోటీ కోసం, కస్టమర్లను ఆకట్టుకునేందుకు అదనంగా మరింత డిస్కౌంట్ ఇచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణల నేపథ్యంలో వాహన తయారీ కంపెనీలు ధరలను తగ్గిస్తామని ప్రకటించాయి. ఈ క్రమంలోనే మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లు ఇస్తామని ప్రకటించింది. అయితే, మార్కెట్లో పోటీ కోసం, కస్టమర్లను ఆకట్టుకునేందుకు అదనంగా మరింత డిస్కౌంట్ ఇచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం కంపెనీ తన ఎస్‌యూవీ మోడళ్లపై అదనపు డిస్కౌంట్లను వెల్లడించింది. దీంతో బొలేరో, బొలెరో నియో, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, థార్, స్కార్పియో క్లాసిక్, స్కార్పియో-ఎన్, థార్ రాక్స్, ఎక్స్‌యూవీ 700లపై రూ. రూ. 2.56 లక్షల వరకు ప్రయోజనాలను ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే, జీఎస్టీ సంస్కరణల తర్వాత ఎంఅండ్ఎం ఇప్పటికే తగ్గింపు ధరలను ప్రకటించింది. సెప్టెంబర్ 6న ప్యాసింజర్ వాహనాల ధరలను రూ. 1.56 లక్షల వరకు తగ్గించింది. తాజా తగ్గింపు దానికి అదనం.
సవరించిన ధరలు
బొలెరో/నియో
కొత్త ఎక్స్-షోరూమ్ ధర: రూ. 8.79 లక్షలు
జీఎస్టీ సంస్కరణ తర్వాత తగ్గింపు: రూ. 1.27 లక్షలు
అదనపు కంపెనీ ప్రయోజనాలు: రూ. 1.29 లక్షలు
మొత్తం డిస్కౌంట్: రూ. 2.56 లక్షలు
ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ
కొత్త ఎక్స్-షోరూమ్ ధర: రూ. 7.28 లక్షలు
జీఎస్టీ సంస్కరణ తర్వాత తగ్గింపు: రూ. 1.56 లక్షలు
అదనపు కంపెనీ ప్రయోజనాలు: రూ. 90 వేలు
మొత్తం డిస్కౌంట్: రూ. 2.46 లక్షలు
థార్
కొత్త ఎక్స్-షోరూమ్ ధర: రూ. 10.32 లక్షలు
జీఎస్టీ సంస్కరణ తర్వాత తగ్గింపు: రూ. 1.35 లక్షలు
అదనపు కంపెనీ ప్రయోజనాలు: రూ. 20 వేలు
మొత్తం డిస్కౌంట్: రూ. 1.55 లక్షలు
స్కార్పియో క్లాసిక్
కొత్త ఎక్స్-షోరూమ్ ధర: రూ. 12.98 లక్షలు
జీఎస్టీ సంస్కరణ తర్వాత తగ్గింపు: రూ. 1.01 లక్ష
అదనపు కంపెనీ ప్రయోజనాలు: రూ. 95 వేలు
మొత్తం డిస్కౌంట్: రూ. 1.96 లక్షలు
స్కార్పియో-ఎన్
కొత్త ఎక్స్-షోరూమ్ ధర: రూ. 13.20 లక్షలు
జీఎస్టీ సంస్కరణ తర్వాత తగ్గింపు: రూ. 1.45 లక్షలు
అదనపు కంపెనీ ప్రయోజనాలు: రూ. 71 వేలు
మొత్తం డిస్కౌంట్: రూ. 2.15 లక్షలు
థార్ రాక్స్
కొత్త ఎక్స్-షోరూమ్ ధర: ₹12.25 లక్షలు
జీఎస్టీ సంస్కరణ తర్వాత తగ్గింపు: రూ. 1.33 లక్షలు
అదనపు కంపెనీ ప్రయోజనాలు: రూ. 20 వేలు
మొత్తం డిస్కౌంట్: రూ. 1.53 లక్షలు
ఎక్స్‌యూవీ700
కొత్త ఎక్స్-షోరూమ్ ధర: ₹13.19 లక్షలు
జీఎస్టీ సంస్కరణ తర్వాత తగ్గింపు: రూ. 1.43 లక్షలు
అదనపు కంపెనీ ప్రయోజనాలు: రూ. 81 వేలు
మొత్తం డిస్కౌంట్: రూ. 2.24 లక్షలు






