- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tesla: దేశంలో తొలి ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించనున్న టెస్లా
ముంబైలో కంపెనీ తన మొదటి ఛార్జింగ్ స్టేషన్‌ను వచ్చే వారం ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఎలన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా ఇటీవలే దేశంలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో కంపెనీ తన మొదటి ఛార్జింగ్ స్టేషన్‌ను వచ్చే వారం ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. టెస్లా తొలి ఛార్జింగ్ స్టేషన్‌లో నాలుగు వీ4 సూప్రర్ ఛార్జింగ్ స్టాల్స్(డీసీ ఛార్జింగ్), నాలుగు డెస్టినేషన్ ఛార్జింగ్ స్టాల్స్(ఏసీ ఛార్జింగ్) ఉంటాయని తెలిపింది. టెస్లా సూపర్‌చార్జింగ్ స్టాల్స్ కిలోవాట్‌కు రూ. 24 నుంచి, 250 కిలోవాట్ గరిష్ట ఛార్జింగ్ స్పీడ్, డెస్టినేషన్ ఛార్జర్లు కిలోవాట్‌కు రూ. 14తో 11 కిలోవాట్ అందిస్తాయని పేర్కొంది. టెస్లా ప్రకటించినట్టుగా దేశంలో ఏర్పాటు చేయబోయే ఎనిమిది సూపర్‌చార్జింగ్ సైట్‌లలో ఇది మొదటిది. టెస్లా సూపర్‌ఛార్జర్లతో కంపెనీ దేశంలో విడుదల చేసిన మోడల్ వై కారు కేవలం 15 నిమిషాల్లో 267 కిలోమీటర్ల రేంజ్ ఛార్జింగ్ అవుతుంది. ఇది ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, గేట్‌వే ఆఫ్ ఇండియా మధ్య 5 సార్లు ప్రయాణించడానికి సరిపోతుందని టెస్లా వెల్లడించింది.






